ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించినా గోరంట్లపై చర్యలెందుకు తీసుకోరు?

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో అసలైందేనని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించినా.. ఎంపీతో సీఎం జగన్‌ ఎందుకు రాజీనామా చేయించడం లేదని

Published : 15 Aug 2022 06:03 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో అసలైందేనని అమెరికాలోని ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించినా.. ఎంపీతో సీఎం జగన్‌ ఎందుకు రాజీనామా చేయించడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. రిపోర్టు వచ్చిన తర్వాత కూడా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని, అనంతపురం ఎస్పీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యమేంటని విమర్శించారు. మంగళగిరిలోకి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత గోరంట్ల మాధవ్‌కు ఏ మాత్రం లేదు. ఆయన నగ్న వీడియోను ఎవరూ మార్ఫింగ్‌, ఎడిటింగ్‌ చేయలేదని అమెరికా ఫోరెన్సిక్‌ నిపుణుడు జిమ్‌ స్టాఫోర్డు ధ్రువీకరించినా మన పోలీసులు మీనమేషాలు లెక్కించడంలో అర్థం లేదు. ఈ రిపోర్టు వచ్చాక వైకాపా మంత్రులు, నాయకుల నోళ్లు మూతపడ్డాయి. మాధవ్‌ను రక్షించాలని చూస్తున్న పోలీసులు కూడా శిక్షార్హులే. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ కేసును దర్యాప్తు చేయొద్దని, వదిలేయమని ఎస్పీకి డీజీపీ సూచనలు చేసినట్లు అనిపిస్తోంది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

* ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆదివారం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, ఎన్నారై కోఆర్డినేటర్‌ చప్పిడి రాజశేఖర్‌, మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని