బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి

బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 25 Nov 2022 04:23 IST

జాతీయ బీసీ సంక్షేమ సంఘం

ఈనాడు, దిల్లీ: బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లను పెంచాలంటూ సంఘం ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. బీసీల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనకు దేశంలోని 14 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని, భాజపా మద్దతు దక్కితే పార్లమెంట్‌లో ఒక్క రోజులోనే బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. బీసీ ఉద్యోగులకు ఉద్యోగోన్నతుల్లోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ధర్నాకు తెరాస రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, ఆళ్ల రామకృష్ణ, వెంకన్న గౌడ్‌, మెట్ట చంద్రశేఖర్‌, బ్రహ్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని