కోటాలో రాహుల్‌కు విద్యార్థుల ఘన స్వాగతం

భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం కోటాకు చేరుకున్నారు.

Published : 09 Dec 2022 05:14 IST

నేడు సోనియా జన్మదినం సందర్భంగా విరామం

కోటా(రాజస్థాన్‌): భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం కోటాకు చేరుకున్నారు. ఉద్యోగ శిక్షణ సంస్థలకు పేరుగాంచిన ఈ నగరంలో రాహుల్‌కు విద్యార్థుల నుంచి ఘన స్వాగతం లభించింది. వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. సూర్యముఖి హనుమాన్‌ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం రాజస్థాన్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఆమె తన జన్మదినోత్సవాన్ని రాహుల్‌, ప్రియాంకలతో కలసి జరుపుకొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా యాత్రకు విరామం ఇవ్వనున్నారు. శనివారం నాటి యాత్రలో సోనియా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

వ్యక్తి ఆత్మహత్యాయత్నంతో కలకలం

కోటాలో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి రాహుల్‌ వెళ్తున్న సమయంలో.. ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేగింది. పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయకుండానే వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని