ముస్లింల బహుభార్యత్వానికి భాజపా వ్యతిరేకం

ముస్లింలలో బహుభార్యత్వాన్ని భాజపా వ్యతిరేకిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టంచేశారు.

Published : 09 Dec 2022 05:21 IST

అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్య

మోరిగావ్‌: ముస్లింలలో బహుభార్యత్వాన్ని భాజపా వ్యతిరేకిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టంచేశారు. ‘‘ఒక మహిళ 20-25 మంది చిన్నారులకు జన్మనివ్వగలదంటూ ఏఐయూడీఎఫ్‌ నేత, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని, మరి ఆ పిల్లల ఆహారం, దుస్తులు, విద్యకయ్యే వ్యయ్యాన్ని ఆయనే భరించాలన్నారు. ‘‘భార్యకు విడాకులివ్వకుండా ముగ్గురు, నలుగురు మహిళలను పెళ్లి చేసుకునే హక్కు స్వతంత్ర భారత దేశంలో ఏ పురుషుడికీ లేదు. అలాంటి వ్యవస్థను మేం మార్చాలనుకుంటున్నాం. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం’’ అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ నేత రకిబుల్‌ హుస్సేన్‌ స్పందించారు. మతంతో ముడిపెట్టడం ద్వారా సున్నితమైన అంశాలను రాజకీయం చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘ముస్లిం పురుషులు అనేక పెళ్లిళ్లు చేసుకోవడం తప్పని భావిస్తే.. దాన్ని కట్టడి చేయడానికి ఒక చట్టం చేయాలి. అప్పటివరకూ రాజకీయ ప్రకటనలు చేయరాదు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని