సమాఖ్య వ్యవస్థపై బుల్డోజర్లతో దాడి

దేశంలో ప్రస్తుతం తుగ్లక్‌ పరిపాలన నడుస్తోందని, కేంద్రంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

Updated : 24 May 2022 05:17 IST

దేశంలో తుగ్లక్‌ పాలన నడుస్తోంది
మమతా బెనర్జీ ధ్వజం

కోల్‌కతా: దేశంలో ప్రస్తుతం తుగ్లక్‌ పరిపాలన నడుస్తోందని, కేంద్రంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థపై అధికార భాజపా, బుల్డోజర్లతో దాడి చేస్తోందని ఆరోపించారు. ఇందుకు కేంద్ర సంస్థలను వాడుకుంటోందని అన్నారు. కాషాయ పార్టీ పరిపాలన.. హిట్లర్‌, ముస్సొలినీ, స్టాలిన్‌ లాంటి నియంతల కంటే దారుణంగా ఉందని నిందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని దీదీ డిమాండ్‌ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా ఆ సంస్థలు.. నిష్పక్షపాతంగా పనిచేసేలా చూడాలని, అందుకు ఓ విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని