Andhra News: రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వారుంటే సంతోషించేవాళ్లం: జీవీఎల్‌ నరసింహారావు

రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల వారు ఉంటే ఎంతో సంతోషించే వాళ్లమనడంలో ఎటువంటి సందేహం లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

Updated : 25 Jun 2022 08:57 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రాల వారు ఉంటే ఎంతో సంతోషించే వాళ్లమనడంలో ఎటువంటి సందేహం లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై దేశవ్యాప్తంగా ఇంత సానుకూల వాతావరణం నెలకొనడం గత మూడు దశాబ్ధాల్లో తానెప్పుడూ చూడలేదన్నారు. దిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ ఆదివాసీ మహిళ, కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా అన్ని విధాలా సుశిక్షితురాలైన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో పండగ వాతావరణం నెలకొంది. దేశానికి వన్నె తెచ్చే ఓ గొప్ప మహిళ ఆమె. ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇస్తున్నాయి...’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఆమెపై రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ ఉపసంహరించుకోవాలన్నారు. దేశ సమగ్రతను, ఐక్యతను ఎవరూ ప్రశ్నించలేరని, దెబ్బతీయలేరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని