Andhra News: మాజీ మంత్రిని ప్రశ్నించాడని.. ఠాణాలో నిర్బంధం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను ప్రశ్నించిన జనసేన నాయకుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో కుటుంబీకులను సైతం

Updated : 18 Aug 2022 07:42 IST

జనసేన నాయకుడి కుటుంబానికి చేదు అనుభవం

గుంటూరు రూరల్‌, గోరంట్ల న్యూస్‌టుడే: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను ప్రశ్నించిన జనసేన నాయకుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో కుటుంబీకులను సైతం రాత్రయినా ఠాణాలోనే కూర్చోబెట్టారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత గుంటూరు గ్రామీణ మండలం చినపలకలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బందలపాడి సాంబశివరావు ఎమ్మెల్యేను నిలదీశారు. ‘33 ఎకరాల చెరువులో నీరు నింపుతామని గ్రామస్థులనుంచి సంతకాలు సేకరించారు. వాటిని ఏ పనికి ఉపయోగించార’ంటూ ప్రశ్నించారు. జడ్పీటీసీ సభ్యుడు, వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతూ గ్రామస్థులకు అన్యాయం చేస్తున్నారని సుచరిత సమక్షంలో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న వైకాపా నేతలు సాంబశివరావును దుర్భాషలాడారు. వైకాపా నేతల ఒత్తిడితో సాంబశివరావుతోపాటు ఆయన తల్లిదండ్రులు, చెల్లెలిని పోలీసులు నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో జనసేన శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని