KTR - Siddaramaiah: మాజీ మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్‌

కర్ణాటక సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) గురించి వైరల్‌ అవుతున్న వీడియోపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై సిద్దరామయ్య కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 19 Dec 2023 15:05 IST

బెంగళూరు : కర్ణాటక సీఎం  సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరలవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) రీపోస్టు చేస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా సిద్దరామయ్య స్పందించారు. అది ఫేక్‌ వీడియో అని కొట్టిపారేస్తూ.. కేటీఆర్‌కు ఘాటుగా బదులిచారు.

KTR - Siddaramaiah: హామీలు ఇచ్చేముందు ఆలోచించరా..? కర్ణాటక సీఎం వైరల్‌ వీడియోపై కేటీఆర్‌ ట్వీట్‌

‘‘కేటీఆర్‌.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓటమిపాలైందో మీకు తెలుసా..?ఎందుకంటే మీరు ఫేక్‌ వీడియో ఏదో.. ఎడిటెడ్‌ వీడియో ఏదో.. నిజమైనదేదో పరిశీలించుకోలేకపోతున్నారు. భాజపా ఫేక్‌ వీడియోలను క్రియేట్‌ చేస్తుంది. మీ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. మీరు భాజపాకు నిజమైన బీ టీమ్‌’’ అంటూ సిద్ధరామయ్య ‘ఎక్స్‌’లో తీవ్రంగా స్పందించారు.

‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’’ అని సిద్దరామయ్య (Siddaramaiah) అసెంబ్లీలో మాట్లాడారంటూ ఆ వీడియోలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు