KTR: భాజపాను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది: కేటీఆర్‌

భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated : 03 Feb 2024 18:29 IST

హైదరాబాద్‌: భాజపాను ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40 స్థానాలను ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదంటూ టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్టీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి వల్లనే ఇండియా కూటమి చెల్లా చెదురవుతోందని.. దీనిపై ఆత్మపరీశీలన చేసుకోవాలన్నారు. దేశంలో భాజపాను మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరన్నారు. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భాజపాతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోందన్నారు. దీంతో భాజపాకు లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని