Andhra news: వైకాపా పాలనలో బస్సెక్కడమూ అదృష్టంగా భావించాలేమో!: లోకేశ్‌

వైకాపా పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.

Published : 14 Apr 2022 13:55 IST

అమరావతి: వైకాపా పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లాగే అధికారులు సైతం ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు స్వల్పమేనని చెబుతూ.. భారీగా పెంచడం దారుణమని ఆక్షేపించారు. అమాంతం ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి.. చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని