Eatala Rajendar: కేసీఆర్‌ ప్రెస్‌మీట్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: ఈటల

హుజూరాబాద్‌ ఫలితం ఆరంభం మాత్రమేనని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

Updated : 24 Sep 2022 15:08 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఫలితం ఆరంభం మాత్రమేనని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గన్‌పార్క్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులు సీఎం కేసీఆర్‌ను వదిలి బయటకు రావాలన్నారు. ఎనిమిదేళ్లుగా వరి ధాన్యం కొన్నదెవరో కేసీఆర్‌ చెప్పాలని ఈటల డిమాండ్‌ చేశారు. ధర్నా చౌక్‌ అవసరమేంటో సీఎంకు తెలిసొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్‌ వద్దన్న వాళ్లే అక్కడ ఆందోళన చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

‘‘భాజపా నాయకత్వంలో కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తా. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండానే. మిల్లింగ్‌ టెక్నాలజీని పెంచుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైంది. కేసీఆర్‌ గంటలకొద్దీ పెట్టిన ప్రెస్‌మీట్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పెద్ద నోరుతో చెబితే అబద్ధాలు నిజాలు అయిపోవు. కేసీఆర్‌ సీఎం అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రజలపై ప్రేమ ఉంటే పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని