Ts News: ప్రధాని మోదీ, కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయి: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ అంటే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ఓ దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. రాజ్యసభలో సభాపక్ష నాయకునిగా మల్లికార్జున ఖర్గే, తెలంగాణలో శాసనసభాపక్షనేతగా భట్టి విక్రమార్క లాంటి దళిత నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు...

Updated : 30 Sep 2022 14:43 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అంటే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి ఓ దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. రాజ్యసభలో సభాపక్ష నాయకునిగా మల్లికార్జున ఖర్గే, తెలంగాణలో శాసనసభాపక్షనేతగా భట్టి విక్రమార్క లాంటి దళిత నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. ఏపీలో కూడా దళిత బిడ్డ శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని తెలిపారు. దళిత గిరిజన బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి రేవంత్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు ప్రైవేటు యూనివర్శిటీలు ఇచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారని ఆక్షేపించారు. కేసీఆర్ పాలనలో పేదలకు చదువు దూరం అయిందని.. మోదీ, కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని