YSRCP: కర్నూల్లోనూ అదే పరిస్థితి.. ‘మమ’ అనిపించిన మంత్రులు

మరో 30 ఏళ్లు రాష్ట్రంలో వైకాపాయే అధికారంలో ఉంటుందని ఏపీ మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సారథ్యంలోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు.

Updated : 29 May 2022 16:17 IST

కర్నూలు: ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రలో భాగంగా వైకాపా మంత్రులు నిర్వహిస్తోన్న సభలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంటోంది. జనాలు లేకపోవడంతో సభలు వెలవెలబోతున్నాయి. కర్నూలులోని సీ క్యాంపు వద్ద ఆదివారం నిర్వహించిన సభకు ప్రజలెవరూ లేకపోవడంతో మంత్రులు తూతూ మంత్రంగా సభ నిర్వహించి వెళ్లారు. 

ఉదయం 9 గంటలకే డ్వాక్రా మహిళలను సభా వేదిక వద్దకు అధికారులు తరలించారు. కనీసం షామియానాలు కూడా లేకపోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు వెనుదిరిగారు. మంత్రులు ఒంటిగంటకు కర్నూలు చేరుకోగా.. అప్పటికే ప్రజలంతా వెళ్లిపోవడంతో సభ బోసిపోయింది. కుర్చీల్లో కూర్చోవాలంటూ కర్నూలు మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఎంత మొత్తుకున్నా ఎవరూ రాలేదు. దీంతో మంత్రులు సభను ‘మమ’ అనిపించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మరో 30 ఏళ్లు రాష్ట్రంలో వైకాపాయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ సారథ్యంలోనే సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని