Covid Vaccine: టీకా వద్దనడానికి బాల్యపు గాయాలే కారణం

కొవిడ్‌ టీకా సురక్షితమని... కరోనా సోకినా, తీవ్రస్థాయి ముప్పు వాటిల్లకుండా కాపాడుతుందని నిపుణులు ఎంత చెబుతున్నా,

Published : 03 Feb 2022 10:52 IST

 తాజా అధ్యయనంలో విశ్లేషణ

లండన్‌: కొవిడ్‌ టీకా సురక్షితమని... కరోనా సోకినా, తీవ్రస్థాయి ముప్పు వాటిల్లకుండా కాపాడుతుందని నిపుణులు ఎంత చెబుతున్నా, కొంతమంది వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. వారు అలా అనడానికి కారణాలేంటన్నది బాంగోర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా విశ్లేషించారు. చిన్నతనంలో వివిధ రకాలుగా బాధలకు గురికావడంవల్లే చాలామంది టీకా తీసుకోవడానికి సందేహించడం లేదా నిరాకరించడం చేస్తున్నట్టు వారు గుర్తించారు. పబ్లిక్‌ హెల్త్‌ వేల్స్, లైవ్‌పూల్‌ హోప్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం సాగించారు. టీకా తీసుకోవడానికి అర్హత ఉండి కూడా దాన్ని తీసుకోవడానికి ముందుకురాని 6,763 మందిని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండకముందు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, మాటల ద్వారా వేధింపులకు గురయ్యారా? తల్లిదండ్రులు తరచూ గొడవ పడేవారా? వారు విడిపోయారా? మద్యం, మత్తు పదార్థాలు తీసుకునే అలవాటుందా? మానసిక అనారోగ్యంతో బాధపడే కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పుడైనా జీవించారా? దీర్ఘకాలిక శారీరక రుగ్మతలేమైనా ఉన్నాయా? అన్న వివరాలు సేకరించి విశ్లేషించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని