ముందు ఎవరి వాదన వినాలి..?

సుప్రీంకోర్టు నుంచి బదిలీ అయిన జ్ఞానవాపి-శృంగార గౌరి ఆలయం కేసులో ఎవరి వ్యాజ్యాన్ని ముందు స్వీకరించాలన్న విషయాన్ని మంగళవారం వారణాసి జిల్లా కోర్టు జడ్జి నిర్ణయించనున్నారు. సోమవారం జడ్జి ఎ.కె. విశ్వేశ్‌.. 45 నిమిషాలు

Published : 24 May 2022 05:13 IST

 ‘జ్ఞానవాపి’ వ్యాజ్యాలపై నేడు నిర్ణయం తీసుకోనున్న వారణాసి కోర్టు

వారణాసి: సుప్రీంకోర్టు నుంచి బదిలీ అయిన జ్ఞానవాపి-శృంగార గౌరి ఆలయం కేసులో ఎవరి వ్యాజ్యాన్ని ముందు స్వీకరించాలన్న విషయాన్ని మంగళవారం వారణాసి జిల్లా కోర్టు జడ్జి నిర్ణయించనున్నారు. సోమవారం జడ్జి ఎ.కె. విశ్వేశ్‌.. 45 నిమిషాలు పాటు హిందూ, ముస్లిం తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు. హిందూ పక్షం వేసిన రిట్‌ పిటిషన్‌కు విచారణర్హత లేదని, దాన్ని కొట్టివేయాలని అంజుమన్‌ ఇంతెజామియా మసీదు సంఘం న్యాయవాది మహమ్మద్‌ తౌహిద్‌ ఖాన్‌ వాదించగా, కమిషన్‌ నివేదిక పూర్తయింది కాబట్టి దానిపట్ల తమకున్న అభ్యంతరాలేమిటో ముస్లిం పక్షం కోర్టుకు తెలపాలని హిందూ పక్షం న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ వాదించారు. దీనిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి ప్రకటించారు. మరోవైపు వీడియో సర్వేలో శివలింగం బయటపడినందున, పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ భక్తురాళ్లు ఈ న్యాయస్థానంలోనే మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందులో మసీదు స్థలాన్ని వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించలేమని 1936లో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యదర్శి ఓ సివిల్‌ దావాలో లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రకటనను కూడా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని