వాయుసేనలో అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం కింద వాయుసేన (ఐఏఎఫ్‌)లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అందులో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఐఏఎఫ్‌ వెల్లడించింది.

Published : 25 Jun 2022 05:51 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకం కింద వాయుసేన (ఐఏఎఫ్‌)లో నియామక ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అందులో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను అనుమతిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఐఏఎఫ్‌ వెల్లడించింది. జులై 5తో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగుస్తుందని తెలిపింది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని ఈ నెల 14న ప్రకటించింది. దానిపై ఇటీవల దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన సంగతి గమనార్హం.

ఎన్‌సీసీ క్యాడెట్లకు బోనస్‌ పాయింట్లు

అగ్నిపథ్‌ పథకంలో ఎన్‌సీసీ క్యాడెట్‌లకు (ఎ, బి, సి సర్టిఫికెట్లు ఉన్నవారందరికి) బోనస్‌ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్బీర్‌పాల్‌ సింగ్‌ చెప్పారు. గ్వాలియర్‌లో శుక్రవారం ఎన్‌సీసీ మహిళా ఆధికారుల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని