శాంతియుత ర్యాలీ చేస్తాం: రెజ్లర్లు

కొత్త పార్లమెంటు భవనం ముందు తాము చేయాలని తలపెట్టిన మహిళా మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి వస్తున్నా.. తాము ముందుకే వెళ్తామని జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన చేస్తున్న రెజ్లర్లు చెప్పారు.

Published : 28 May 2023 02:50 IST

దిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ముందు తాము చేయాలని తలపెట్టిన మహిళా మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి వస్తున్నా.. తాము ముందుకే వెళ్తామని జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన చేస్తున్న రెజ్లర్లు చెప్పారు. ఆదివారం జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంటుకు శాంతియుత ర్యాలీ చేస్తామని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించాల్సి ఉండగా.. ఈ భవనం ఎదుటే మహా పంచాయత్‌ నిర్వహిస్తామని రెజ్లర్లు చెప్పడంతో పరిస్థితి వేడెక్కింది. ‘‘మహా పంచాయత్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే అక్కడే పంచాయత్‌ నిర్వహిస్తాం’’ అని  స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చెప్పింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని