Yuzvendra Chahal: మలింగ సరసన చాహల్‌

రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ ఖాతాలో మరో ఘనత చేరింది. అద్వితీయమైన బౌలింగ్‌తో అదరగొడుతున్న చాహల్‌ ఈ సీజన్‌లో 20 వికెట్ల మైలురాయిని దాటాడు. శనివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో ముగ్గురిని ఔట్‌ చేసిన చాహల్‌ తన వికెట్ల

Updated : 09 May 2022 06:51 IST

ముంబయి: రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ ఖాతాలో మరో ఘనత చేరింది. అద్వితీయమైన బౌలింగ్‌తో అదరగొడుతున్న చాహల్‌ ఈ సీజన్‌లో 20 వికెట్ల మైలురాయిని దాటాడు. శనివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో ముగ్గురిని ఔట్‌ చేసిన చాహల్‌ తన వికెట్ల సంఖ్యను 22కు పెంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలో 4 సీజన్‌లలో 20.. అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చాహల్‌ ఘనత సాధించాడు. ఒకప్పటి ముంబయి ఆటగాడు, ప్రస్తుతం రాజస్థాన్‌ బౌలింగ్‌ కోచ్‌ లసిత్‌ మలింగ పేరిట ఈ రికార్డు ఉంది. ఈ మెగా టోర్నీలో మలింగ 2011 (28 వికెట్లు), 2012 (22), 2013 (20), 2015 (24)లో 20.. అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. 2013, 2015లో ముంబయి ఛాంపియన్‌గా నిలిచింది. 2015 (23), 2016 (21), 2020 (21)లో బెంగళూరు తరఫున చాహల్‌ 20.. అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఆడుతున్న చాహల్‌ ఇప్పటికే 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా బౌలర్‌ సునీల్‌ నరైన్‌ మూడు సార్లు (2012, 2013, 2014) 20.. అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని