మూడో టీ20లో అఫ్గాన్‌ గెలుపు

ఐర్లాండ్‌తో అయిదు టీ20ల పోరులో సిరీస్‌ ఆశలను అఫ్గానిస్థాన్‌ సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టీ20ల్లో ఓడిన ఆ జట్టు.. మూడో మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-2తో నిలిచింది.

Published : 14 Aug 2022 03:53 IST

బెల్‌ఫాస్ట్‌: ఐర్లాండ్‌తో అయిదు టీ20ల పోరులో సిరీస్‌ ఆశలను అఫ్గానిస్థాన్‌ సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టీ20ల్లో ఓడిన ఆ జట్టు.. మూడో మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-2తో నిలిచింది. మొదట అఫ్గాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. రహ్మనుల్లా (53), నజిబుల్లా (42), ఇబ్రహీం (36), హజ్రతుల్లా (39) సత్తా చాటారు. ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. 85 పరుగులకే 7 వికెట్లు పడినా.. డాక్రెల్‌ (58 నాటౌట్‌), ఫిన్‌ (36) పోరాడారు. కానీ ఫిన్‌ ఔట్‌ కావడంతో ఐర్లాండ్‌ ఛేదనలో వెనుకబడిపోయింది. డాక్రెల్‌, ఫిన్‌తో పాటు టకర్‌ (31) రాణించాడు. నవీనుల్‌ హక్‌ (3/38), ముజీబ్‌ (2/28), ఫారూఖి (2/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని