నెదర్లాండ్స్‌తో తొలి వన్డేలో పాక్‌ విజయం

ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ (109; 109 బంతుల్లో 12×4, 1×6) సెంచరీతో సత్తాచాటడంతో తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది

Published : 18 Aug 2022 02:23 IST

రాటర్‌డామ్‌: ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ (109; 109 బంతుల్లో 12×4, 1×6) సెంచరీతో సత్తాచాటడంతో తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 314 పరుగులు రాబట్టింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (74; 85 బంతుల్లో 6×4, 1×6), షాదాబ్‌ఖాన్‌ (48 నాటౌట్‌; 28 బంతుల్లో 4×4, 2×6) మెరిశారు. నెదర్లాండ్స్‌ 8 వికెట్లకు 298 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌సింగ్‌ (65; 98 బంతుల్లో 5×4), టామ్‌ కూపర్‌ (65; 54 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (71; 60 బంతుల్లో 6×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. పాక్‌ బౌలర్లు హారిస్‌ రౌఫ్‌ (3/67), నసీమ్‌ షా (3/51) మూడేసి వికెట్లు పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని