జాతీయ క్రీడలకు సింధు దూరం

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి. సింధు జాతీయ క్రీడలకు దూరమైంది. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా గాయపడిన సింధు పూర్తిగా కోలుకోని నేపథ్యంలో జాతీయ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Published : 25 Sep 2022 03:20 IST

హైదరాబాద్‌: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి. సింధు జాతీయ క్రీడలకు దూరమైంది. కామన్వెల్త్‌ క్రీడల సందర్భంగా గాయపడిన సింధు పూర్తిగా కోలుకోని నేపథ్యంలో జాతీయ క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. సెప్టెంబరు 29న ఆరంభ వేడుకల్లో ఆమె పాల్గొననుంది. ‘‘మడమ గాయం కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోతున్నా. ఫిట్‌గా ఉంటే రాష్ట్రం తరఫున పోటీపడేదాన్ని. ప్రస్తుతం నా దృష్టంతా ఆసియా క్రీడలు, పారిస్‌ ఒలింపిక్స్‌పైనే. ఆ రెండు క్రీడలకు ఫిట్‌గా ఉండటం ముఖ్యం’’ అని సింధు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని