అగ్రస్థానంలో భారత్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని టీమ్‌ఇండియా మరింత బలోపేతం చేసుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న రోహిత్‌సేన సమీప ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై ఏడు పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఒక పాయింటును మెరుగుపర్చుకుని 268 పాయింట్లతో నిలిచింది. ప్రపంచకప్‌ నేపథ్యంలో తన నంబర్‌వన్‌

Updated : 27 Sep 2022 04:05 IST

 టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని టీమ్‌ఇండియా మరింత బలోపేతం చేసుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న రోహిత్‌సేన సమీప ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై ఏడు పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఒక పాయింటును మెరుగుపర్చుకుని 268 పాయింట్లతో నిలిచింది. ప్రపంచకప్‌ నేపథ్యంలో తన నంబర్‌వన్‌ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్‌ భారత్‌కు చక్కని అవకాశం. 258 పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఆరో స్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని