పంత్‌కు విశ్రాంతినివ్వాలి: శ్రీకాంత్‌

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన అవకాశాల్ని చెడగొట్టుకుంటున్నాడని సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు.

Published : 29 Nov 2022 02:21 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తన అవకాశాల్ని చెడగొట్టుకుంటున్నాడని సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. ఫామ్‌ను దొరకబుచ్చుకోడానికి పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం ఇవ్వాలని శ్రీకాంత్‌ సూచించాడు. ‘‘పంత్‌కు విశ్రాంతినిచ్చి.. ‘కొంచెం వేచి ఉండి టీమ్‌ఇండియాకు ఆడండి’ అని చెప్పాలి. పంత్‌ కూడా తనకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. నేను చాలా నిరాశకు లోనయ్యా. ఏమిటిది పంత్‌? అవకాశాల్ని చెడగొట్టుకుంటున్నావు. చెలరేగి ఆడితే బాగుంటుంది కదా. ప్రపంచకప్‌ కూడా వస్తుంది. పంత్‌ పరుగులు రాబట్టడం లేదని చాలామంది అంటున్నారు. దీంతో మంటకు పెట్రోలు తోడవుతుంది. ఇవన్నీ అతనిపై ఒత్తిడి పెంచేవే. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. కొద్దిసేపు క్రీజులో నిలిచాక భారీషాట్లకు వెళ్లాలి. ప్రతిసారి తన వికెట్‌ పారేసుకుంటున్నాడు’’ అని శ్రీకాంత్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని