Mohammed Shami: షమీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

Mohammed Shami: టీమ్‌ఇండియా పేసర్‌ షమీ తల్లి అస్వస్థతకు గురయ్యారు. ఫైనల్‌ మ్యాచ్‌ వేళ తీవ్ర ఆందోళన చెందడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

Published : 20 Nov 2023 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచకప్‌ (ODI Wordcup 2023) ఫైనల్‌ మ్యాచ్‌ (Final Match) సమయంలో టీమ్‌ఇండియా (Team India) ఆటగాడు మహమ్మద్‌ షమీ (Mohammed Shami) తల్లి అనుమ్‌ ఆరా అస్వస్థతకు గురయ్యారని అతడి బంధువులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఉన్న ఆమె.. మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం మరో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు షమీ బంధువులు జాతీయ మీడియాకు వెల్లడించారు.

‘‘షమీ తల్లి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న మ్యాచ్‌ సమయంలో ఒక్కసారిగా ఆందోళనకు గురవడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేర్చాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని షమీ బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

ఓటమి తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు మోదీ..

ఈ ప్రపంచకప్‌ టోర్నీలోకి షమీ ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ.. అద్భుత రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో ఐదో మ్యాచ్‌ నుంచి ఆడిన ఈ సీనియర్‌ పేసర్‌.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.  సెమీస్‌లో షమీ ఏడు వికెట్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించిన తీరు చిరస్మరణీయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని