Published : 30 Nov 2021 19:44 IST

Redmi Note 11T 5G: నోట్‌ సిరీస్‌లో రెడ్‌మీ కొత్త 5జీ ఫోన్‌.. వివరాలివే!  

ఇంటర్నెట్‌డెస్క్‌: 5జీ శ్రేణిలో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 11టీ 5G (Redmi Note 11T 5G) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో ఇది రెండో 5జీ మోడల్‌. గతేడాది నోట్‌ 10టీ 5జీ మోడల్‌ను రెడ్‌మీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర 5జీ మోడల్స్‌కు పోటీగా రెడ్‌మీ నోట్‌ 11టీ 5జీలో తక్కువ ధరకే అధునాతన ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇంతకీ ఆ ఫీచర్లేంటి.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది చూద్దాం. 


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్‌ఐయూఐ 12.5 ఓఎస్‌తో నోట్‌ 11టీ పనిచేస్తుంది. 


ఈ ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. వీటితోపాటు సన్‌లైట్ డిస్‌ప్లే, రీడింగ్ మోడ్ వంటి ఫీచర్లున్నాయి. సన్‌లైట్ డిస్‌ప్లేతో సూర్యుడి వెలుతురులో డిస్‌ప్లే పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా, రీడింగ్ మోడ్‌తో కళ్లపై ఒత్తిడి లేకుండా కంటెంట్ చదవొచ్చని రెడ్‌మీ తెలిపింది. ఐపీ53 డస్ట్‌, స్ప్లాష్ ప్రూఫ్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. 


నోట్‌ 11టీలో 6 నానో మీటర్‌ ఆర్కిటెక్చర్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. ఏఆర్‌ఎమ్‌ మలి-జీ57 ఎమ్‌సీ2 గ్రాఫిక్‌ కార్డ్ ఉపయోగించారు.  


గేమింగ్ ప్రియుల కోసం 240 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో హైపర్‌ ఇంజిన్ గేమ్‌ టెక్నాలజీ 2.0ను ఇస్తున్నారు. వీటితోపాటు గేమ్‌ టర్బో ఫెర్మామెన్స్‌ మోడ్‌, సౌండ్‌ క్వాలిటీ ఆప్టిమైజేషన్‌, నెట్‌వర్క్‌ ఆప్టిమైజేషన్‌, వాయిస్‌ ఛేంజర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.   


రెడ్‌మీ ఈ ఫోన్‌లో మూడు కెమెరాలను అమర్చింది. వెనుక రెండు, ముందు ఒకటి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో పామ్‌ షట్టర్‌ ఫీచర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 


ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజులు నిరంతరాయంగా పనిచేస్తుందని రెడ్‌మీ చెబుతోంది. 


రెడ్‌మీ నోట్ 11టీ 5జీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999. 6 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ. 17,999. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబరు 7 నుంచి ఎమ్‌ఐ వెబ్‌సైట్‌, ఎమ్‌ఐ హోం, అమెజాన్‌ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. అక్వేరియమ్‌ బ్లూ, మ్యాటీ బ్లాక్‌, స్టార్‌డస్ట్ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని