రాజ్యసభకు పార్థసారథి, దామోదర్‌రావుల నామినేషన్లు

రాజ్యసభ ఎన్నికలు జరిగే రెండు స్థానాలకు తెరాస అభ్యర్థులుగా బండి పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్‌రావులు బుధవారం శాసనసభలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల

Published : 26 May 2022 05:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ ఎన్నికలు జరిగే రెండు స్థానాలకు తెరాస అభ్యర్థులుగా బండి పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్‌రావులు బుధవారం శాసనసభలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి వారు తమ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబిత, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రెండు స్థానాలకు ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన, 3వతేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది.

సీఎంకు కృతజ్ఞతలు: నామినేషన్‌ వేసిన అనంతరం పార్థసారథిరెడ్డి, దామోదర్‌రావులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీలు జోగినపల్లి సంతోష్‌, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు తదితరులు అభ్యర్థులను అభినందించారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర బుధవారం కుటుంబ సమేతంగా కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని