పులిచింతల విద్యుత్తు కేంద్రం రికార్డు

పులిచింతల జల విద్యుత్తు కేంద్రం అరుదైన రికార్డు సాధించింది. నీటి ప్రవాహం ప్రారంభమైన 5 నెలల్లోనే 254.671 మిలియన్‌ యూనిట్ల(మి.యూ.) విద్యుదుత్పత్తి చేసినట్లు  జెన్‌కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ ఆదివారం తెలిపారు.

Published : 29 Nov 2021 04:45 IST

అయిదు నెలల్లో 254.67 మి.యూ విద్యుదుత్పత్తి

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: పులిచింతల జల విద్యుత్తు కేంద్రం అరుదైన రికార్డు సాధించింది. నీటి ప్రవాహం ప్రారంభమైన 5 నెలల్లోనే 254.671 మిలియన్‌ యూనిట్ల(మి.యూ.) విద్యుదుత్పత్తి చేసినట్లు  జెన్‌కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ ఆదివారం తెలిపారు. విద్యుత్తు కేంద్రం నిర్మించిన సమయంలో 100 ఏళ్ల ప్రవాహాన్ని గణించి  ఏడాదిలో గరిష్ఠంగా 219.54 మి.యూ. ఉత్పత్తి చేయవచ్చని జెన్‌కో అధికారులు అంచనా వేశారు. అయితే ఈ నీటి ఏడాదిలో 5 నెలల్లోనే కేంద్రం ఈ లక్ష్యాన్ని సాధించింది. గత జులైలో కృష్ణానదిలో ప్రవాహం మొదలవగా.. ఈ ఏడాది 219.54 మి.యూ. విద్యుదుత్పత్తి లక్ష్యం సాధించాలని అధికారులు నిర్దేశించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని