మందుల దుకాణాల్లో ఫార్మసిస్టు సేవలు తప్పనిసరి: డీసీఏ

రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో తప్పనిసరిగా అర్హులైన ఫార్మసిస్టుల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీఏ) సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా గురువారం ఆదేశాలు జారీచేశారు.

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో తప్పనిసరిగా అర్హులైన ఫార్మసిస్టుల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీఏ) సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా గురువారం ఆదేశాలు జారీచేశారు. అధిక సంఖ్యలో మందుల దుకాణాల్లో ఫార్మసిస్టు లేకుండానే రోగులకు మందులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వైద్యుడు రాసిచ్చిన చీటీని ఫార్మసిస్టు మాత్రమే పరిశీలించి ఔషధాలను అందించాలనీ, రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు  ఉండేలా ఔషధ నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రీతిమీనా ఆదేశించారు. ఇందుకోసం తరచూ తనిఖీలు నిర్వహించాలనీ, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

5న ప్రవేశపరీక్ష
రాష్ట్రంలోని 11 ఎస్సీ స్టడీసర్కిల్‌లో ఫౌండేషన్‌ కోర్సుకు శిక్షణ కోసం ఈనెల 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆర్‌.వేణుగోపాల్‌రావు తెలిపారు. పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల సొంత జిల్లాల్లోనే ఏర్పాటు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని