Special Trains: శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి బాగా ఉంది. రోజూ వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఈ నేపథ్యంలో మరో 28 ప్రత్యేక రైలు సర్వీసులు

Updated : 24 Dec 2021 09:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి బాగా ఉంది. రోజూ వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఈ నేపథ్యంలో మరో 28 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవి జోన్‌ పరిధిలోని కాచిగూడ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాందేడ్‌ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్‌కు.. అక్కడినుంచి ఈ స్టేషన్లకు నడుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 3 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రైళ్లలో సెకండ్‌, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌తో పాటు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయని, అన్ని బోగీల్ని రిజర్వేషన్‌తో నడిపించనున్నట్లు ద.మ.రైల్వే పేర్కొంది.

మెము రైలు నంబరు మార్పు

కాచిగూడ-మిర్యాలగూడ మెము రైలుని డిసెంబరు 31 వరకు 07274 నంబరుతో నడిపిస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ రైళ్లు జనవరి 1వ తేదీ నుంచి 07276/07974 నంబర్లతో నడుస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని