చిన్న పరిశ్రమలకు చేయూత

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated : 18 Jan 2022 04:34 IST

 తెలంగాణ సర్కారుతో సిడ్బి ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బి) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  ఒప్పంద పత్రాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ సంచాలకుడు కృష్ణభాస్కర్‌, బ్యాంకు ఉప మేనేజింగు డైరెక్టర్‌ వీఎస్‌ వెంకటరావులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సిడ్బి సహకారంతో పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. వెంకటరావు మాట్లాడుతూ.. తమ బ్యాంకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ద్వారా చిన్న పరిశ్రమలకు ఈక్విటీ మద్దతు, వడ్డీ రాయితీ, సంక్షోభంలో ఉన్న, అవసరమైన వాటికి సాయం అందిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని