
Published : 22 Jan 2022 05:01 IST
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చట్ట సవరణ
హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని ఏపీ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరింది. ఈ వాదనపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, బాలాజీ వడేరా అభ్యంతరం తెలిపారు. దేవాదాయ చట్టంలో ‘ప్రత్యేక ఆహ్వానితుల’ ప్రస్తావనే లేదని తెలిపారు. ఇప్పటికే తితిదే బోర్డు సభ్యులుగా 29 మంది ఉన్నారని, సవరణ చేయడం చట్ట విరుద్ధమేనని అన్నారు. తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తూ విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.
Advertisement
Tags :