అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం

అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్‌ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు.

Published : 23 Apr 2024 04:04 IST

కాళేశ్వరం, న్యూస్‌టుడే: అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్‌ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ  ఆదేశాల మేరకు పియర్స్‌ వద్ద సౌండింగ్‌, ప్రోబింగ్‌ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ పనులకు  ఇసుక మేటలు ఇబ్బందిగా మారడంతో.. తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. పియర్స్‌ స్ట్రక్చర్‌ వద్ద 6.20 లక్షల క్యూబిక్‌ మీటర్లు, ఎగువన 2.54 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర మేటలున్నట్లు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని