పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్‌ అరణ్య’

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్‌ పాయెంగ్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ‘వృక్ష వేద్‌ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 03 May 2024 05:13 IST

పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్‌ పాయెంగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్‌ పాయెంగ్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ‘వృక్ష వేద్‌ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అస్సాంలోని జోర్హాట్‌ అటవీ ప్రాంతంలో ఉన్న అరుణాచల ద్వీపంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృక్షవేద్‌ అరణ్యలో భాగంగా తాము పదివేల మొక్కలు నాటబోతున్నామని జాదవ్‌ పాయెంగ్‌ వెల్లడించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ కరుణాకర్‌రెడ్డి, రుతురాజ్‌ తదితరులు పాల్గొన్నారు. జాదవ్‌ పాయెంగ్‌ మాట్లాడుతూ పచ్చని పుడమి కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన సంపద వృక్షాలే అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సంతోష్‌కుమార్‌ ‘ఎక్స్‌’లో పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని