విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి

ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌ స్పష్టం చేశారు.

Updated : 03 May 2024 05:27 IST

అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌ వ్యాస్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో దిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ఆయన తెలంగాణ ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ కోసం సమర్థులైన సెక్టోరల్‌ ఆఫీసర్లను నియమించాలని, పోలింగ్‌ ప్రారంభానికి 72 గంటల ముందు నుంచి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఓటర్లకు సమాచార పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డుల జారీ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా పరిస్థితులను ఆరా తీశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అదనపు బలగాలను మోహరించాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, ఎన్నికల వ్యయ నోడల్‌ అధికారి మహేశ్‌భగవత్‌, అదనపు డీజీ సంజయ్‌జైన్‌, ఎన్నికల సంఘం అధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని