అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే

అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Published : 03 May 2024 05:15 IST

పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ పేర్కొన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో విప్లవ రచయితల సంఘం(విరసం) ఆధ్వర్యంలో.. ‘కార్పొరేట్‌ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌.. అక్కడి అమాయక ప్రజలపై దాడులు, హత్యలు’ అనే అంశంపై వ్యాసాల కూర్పుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సహజ సంపదను బహుళజాతి సంస్థలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. సంబంధిత చర్యలను ప్రతిఘటించేలా హక్కుల కార్యకర్తలు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని..  ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలని కోరారు. సభలో విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, ప్రొఫెసర్‌ సమున్నత, సామాజిక కార్యకర్త రవి నర్ల, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని