పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?

అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు.

Published : 03 May 2024 05:25 IST

 రేడియో అవసరం లేకుండా ‘న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌’ యాప్‌లో ప్రసారాలు

నయీంనగర్‌(హనుమకొండ), న్యూస్‌టుడే: అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. ఆకాశవాణి ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌లోకి వెళ్లి ప్లేస్టోర్‌లో ‘న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రేడియో ఛానళ్లలో భాషతోపాటు ఆకాశవాణి కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. లైవ్‌ రేడియో క్లిక్‌ చేయగానే ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచంలో ఎక్కడున్నా అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సినీగీతాలు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నీతికథలు వినొచ్చు. వేసవి సందర్భంగా పిల్లలకు ఇష్టమైన పాటలు, పెద్దల సూక్తులు, పద్య పఠనాలు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని