Published : 09/02/2023 20:47 IST

పిల్లల్లో మలబద్ధకం.. నివారించాలంటే..!

పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అయితే ఇది పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కదలకుండా ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో మలబద్ధకం రావడానికి గల ముఖ్య కారణాలు, దీనిని నివారించే మార్గాల గురించి తెలుసుకుందాం రండి.

ముఖ్య కారణాలివే!

శారీరక శ్రమ లేకపోవడం/ఆటలాడకపోవడం/ ఎక్కువసేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం

నీళ్లు సరిగా తాగకపోవడం

జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం

రాత్రిపూట ఆలస్యంగా తినడం

అర్ధరాత్రి వరకు మేల్కోవడం

సమయానికి తినకపోవడం/ క్రమం తప్పిన ఆహారపు అలవాట్లు

సరిగా నిద్ర పట్టకపోవడం

జీవక్రియల పనితీరు సరిగ్గా లేకపోవడం

హెల్దీ డైట్‌ పాటించకపోవడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం

నివారణ చిట్కాలు

ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పిల్లలతో తాగించాలి.

రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండు ద్రాక్షలను కూడా ఉదయం లేవగానే తినిపించాలి.

గోరువెచ్చని పాలల్లో అర టీస్పూన్‌ ఆవు నెయ్యి కలిపి రాత్రిపూట పడుకునే ముందు పిల్లలకు అందించాలి.

ఇంగువను పేస్ట్‌లాగా తయారుచేసుకుని పిల్లల బొడ్డు చుట్టూ సవ్యదిశలో రాయాలి. దీనివల్ల వారిలో అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు. కాబట్టి వారికి ఉడకబెట్టిన, వండిన ఆహార పదార్థాలనే అందించాలి.

పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, నూనెల మోతాదును బాగా తగ్గించాలి.

వివిధ రకాల వ్యాయామాలు చేయడంతో పాటు ఆటలు ఆడేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వాకింగ్‌, రన్నింగ్‌ లాంటివి అలవాటు చేయాలి.

ఈ విధంగా చక్కటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పిల్లల్లో మలబద్ధకానికి చెక్ పెట్టచ్చు. ఒకవేళ అప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని