Published : 13/11/2022 11:19 IST

ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా డిశ్చార్జ్.. ఎందుకిలా?

నమస్తే డాక్టర్‌. నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈమధ్యే నాకు పిరియడ్‌ మిస్‌ అయితే ఇంట్లో నే ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని వచ్చింది. అయితే హాస్పిటల్‌లో చేయించుకుంటే వీక్‌ పాజిటివ్‌ అని డాక్టర్‌ చెప్పారు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి కొన్ని ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. అవి వాడితే లేత గోధుమ రంగు, ఎరుపు రంగు డిశ్చార్జ్‌ లైట్‌గా అవు తోంది. అసలు నేను గర్భిణినా, కాదా తెలియట్లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ని కాకపోతే అంతకుముందులాగా నాకు పిరియడ్స్‌ వచ్చి, నార్మల్‌ బ్లీడింగ్‌ కావాలంటే నేనేం చేయాలో చెప్పగలరు. - ఓ సోదరి

జ. మీరు రాసిన దాన్ని బట్టి చూస్తే బహుశా మీకు గర్భం వచ్చినందుకే అది నిలవడానికి డాక్టర్‌ ఆ ట్యాబ్లెట్స్‌ ఇచ్చి ఉంటారు. అయితే లోపల పిండం సరిగ్గా ఎదుగుతోందా లేదా తెలుసుకోవాలంటే మీరు మళ్లీ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిండం ఎదుగుదల సరిగ్గా లేకపోతే మాత్రల ద్వారా గానీ లేదా ఒక చిన్న ఆపరేషన్‌ ద్వారా గానీ గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిరియడ్స్‌ ముందులాగే నార్మల్‌గా వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని