సల్మాన్‌ రష్దీపై దాడిలో మా ప్రమేయం లేదు

ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నసీర్‌ కనానీ సోమవారం వెల్లడించారు. ‘

Published : 16 Aug 2022 06:25 IST

ఇరాన్‌ ప్రకటన

దుబాయ్‌, న్యూయార్క్‌: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి నసీర్‌ కనానీ సోమవారం వెల్లడించారు. ‘‘అమెరికాలో సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడి ఘటనపై నిందలు, ఆరోపణలు చేయడానికి రష్దీ, ఆయన అనుయాయులే అర్హులన్నది మా భావన. ఈ ఘటనపై ఇరాన్‌ను నిందించడానికి ఎవరికీ హక్కులేదు’’ అని కనానీ పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా మీడియా పేర్కొన్నదానికి మించి అదనపు సమాచారం ఏమీ తమ వద్ద లేదని వెల్లడించారు. రష్దీపై దాడి అనంతరం ఇరాన్‌ బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. విదేశాల్లో అసమ్మతీయులను అంతమొందించే కార్యక్రమాలను ఇరాన్‌ చేపడుతోందన్న పాశ్చాత్య దేశాలు, న్యాయవాదుల వాదనలను 1979 ఇస్లామిక్‌ విప్లవం నుంచి ఆ దేశం తిరస్కరిస్తోంది.

రష్దీ హాస్య చతురత చెక్కుచెదరలేదు

సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నప్పటికీ ఆయన హాస్య చతురత చెక్కుచెదరలేదని రష్దీ కుమారుడు జాఫర్‌ రష్దీ పేర్కొన్నారు. తన తండ్రికి అత్యున్నత వైద్య చికిత్స అందుతోందని ఆయన ట్విటర్‌ సందేశంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని