USA: నిపుణుల కొరత ఉంది.. H-1B వీసాలు పెంచండి: అమెరికా ప్రభుత్వానికి కంపెనీల అభ్యర్థన
అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని ఐటీ సర్వీస్ అనే సంఘం పేర్కొంది. దీనిలో దాదాపు 2,100 చిన్న, మధ్యశ్రేణి సంస్థలు భాగస్వాములు. నిపుణులను నియమించుకోవడానికి వీసాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: నిపుణుల కొరత తీవ్రంగా ఉండటంతో హెచ్-1బీ(H-1B) వీసాల కోటాను 65,000 నుంచి రెట్టింపు చేయాలని 2,100 చిన్న, మధ్య శ్రేణి ఐటీ కంపెనీలు అమెరికా(USA) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. వీటిల్లో భారతీయుల నిర్వహణలోనివి కూడా చాలా ఉన్నాయి. అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి.
అమెరికా హెచ్1-బీ వీసాదారులకు కెనడా శుభవార్త
ఐటీ సర్వీస్ (ITServe) అనే అసొసియేషన్‌లోని 241 మంది సభ్యులు మంగళవారం కాంగ్రెషనల్ అడ్వకసి డే నిమిత్తం సమావేశమయ్యారు. నిపుణుల కొరత అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లకు తెలియజేయాలని నిర్ణయించారు. నిపుణుల కొరత తమ వ్యాపారం, అమెరికా అభివృధ్దిపై ప్రభావం చూపిస్తోందని వారు పేర్కొన్నారు. దీంతో 1,30,000 హెచ్1బీ వీసాలు జారీచేయాలని కోరడంతోపాటు.. స్టెమ్ (STEM) (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)విద్యపై పెట్టుబడులు పెంచాలని కోరారు. ఫలితంగా స్థానికంగా నిపుణులను తయారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఐటీ సర్వీస్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ దేశంలోని 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాం. 1,75,000 ఉపాధి అవకాశాలు, నిపుణల ఉద్యోగాలను సృష్టించగలం. దేశ జీడీపీకి ఏటా 12 బిలియన్ డాలర్లు అందిస్తాం’’ అని వెల్లడించారు.
ఐటీ సర్వీస్ బృందం విజ్ఞప్తులకు అనుగుణంగా ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హైస్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ ఫర్ ఎంప్లాయిమెంట్ (హెచ్‌ఐఆర్‌ఈ) చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం పోటీ తత్వాన్ని పెంచడంతోపాటు.. నిపుణుల కొరతను కూడా తీరుస్తుందని ఆయన వెల్లడించారు. దీంతోపాటు ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో స్టెమ్ విద్యపై వెచ్చించే మొత్తాన్ని పెంచనున్నారు. ‘‘ఉద్యోగ సృష్టి, భవిష్యత్తు ఆర్థిక నిర్మాణం కోసం దేశీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులతో టెక్నాలజీ అభివృద్ధిలో ముందుండాలి. ప్రపంచంలో సృజనాత్మకత, టెక్నాలజీలో అమెరికా లీడర్‌గా ఉండాలి ’’ అని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్