Moscow: మాస్కో విమానాశ్రయంపై డ్రోన్ల దాడి

రష్యా రాజధాని మాస్కో అంతర్జాతీయ విమనాశ్రయంపై దాడి జరిగింది. 

Updated : 30 Jul 2023 13:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) రాజధాని మాస్కో(Moscow)పై ఆదివారం డ్రోన్లు విరుచుకుపడ్డాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ పలు డ్రోన్లను కూల్చివేసిందని పేర్కొంది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయి.

పోలండ్‌ దిశగా వాగ్నర్‌ సేనలు

ఈ దాడి వెనుక కీవ్‌ ఉందని మాస్కో ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించింది. ‘‘జులై 30వ తేదీ ఉదయం కీవ్‌ పాలకులు మానవ రహిత విమానంతో ఉగ్ర దాడికి యత్నించారు. దీనిని భగ్నం చేశాం. ఒక ఉక్రెయిన్‌ యూఏవీని కూల్చివేశాం. మరో రెండు డ్రోన్లు కూడా మా ఎలక్ట్రానిక్‌ వార్ఫెర్‌ వ్యవస్థ దెబ్బకు నియంత్రణ కోల్పోయి రెండు భవనాలపై కూలిపోయాయి’’ అని రక్షణశాఖ వెల్లడించింది. రెండు ఆఫీస్‌ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని రష్యా మేయర్‌ సెర్గీ సోబియన్‌ పేర్కొన్నారు. సరిహద్దులకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్‌ దాడి జరగడం ఆదేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు.

ఈ ఘటనతో మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేసినట్లు టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. దాదాపు గంట తర్వాత ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని