Postal Department: ఖాతాలోని సొమ్ము ఉచితంగా ఇంటికి..

ప్రధానాంశాలు

Postal Department: ఖాతాలోని సొమ్ము ఉచితంగా ఇంటికి..

ఆధార్‌తో అనుసంధానత తప్పనిసరి అంటున్న తపాలా శాఖ

ఈనాడు,  హైదరాబాద్‌: ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును సైతం ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది తపాలాశాఖ. మీ ఖాతా ఎక్కడున్నా.. అవసరమయ్యే మొత్తం చేరవేస్తామంటోంది. తపాలా పొదుపు ఖాతాలోనివే కాదు.. ఇతర బ్యాంకుల్లో మీ సొమ్ములున్నా వాటిని తెచ్చి ఇస్తామంటోంది. ఇందుకోసం మీ ఖాతాకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానిస్తే చాలంటోంది.  బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడం వృద్ధులు, మహిళలకు  కాస్త వ్యయప్రయాసలతో కూడిన పని. కరోనా వేళ ఇలాంటి ఇబ్బందులను తపాలాశాఖ తీర్చింది. ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా.. ఆధార్‌తో అనుసంధానమైతే, బయోమెట్రిక్‌ విధానంతో ఇంటికే వచ్చి డబ్బు చెల్లించింది. ఇందుకు సమీప తపాలా కార్యాలయం ఫోన్‌ నంబరు తీసుకుని సంప్రదిస్తే సరిపోతుందని, అవసరమైన మొత్తం చెబితే ఆ మేరకు సిబ్బంది డబ్బు తెచ్చిస్తారని తపాలాశాఖ సహాయ సంచాలకులు జె.శ్రీనివాస్‌ చెప్పారు. రోజుకు కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.10వేలు తీసుకోవచ్చన్నారు. ఇలా 30 రోజులు సేవలు పొందవచ్చన్నారు.

రాష్ట్రంలో 82.67 లక్షల పొదుపు ఖాతాలు
రాష్ట్రంలో తపాలాశాఖకు మొత్తం 82.67 లక్షల పొదుపు ఖాతాలున్నాయి.27.09 లక్షల ఆసరా పింఛనుదారులుండగా.. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళల పింఛన్లకు సంబంధించిన సేవలను తపాలాశాఖ అందజేస్తోంది. తపాలా బ్యాంకుకు నేరుగా వెళ్లి ఎన్నిసార్లు డబ్బులు వేసినా, తీసినా పైసా చెల్లించాల్సిన పనిలేదు. తపాలా ఏటీఎంలలో మాత్రం 5సార్లు ఉచిత సేవలు పొందవచ్చు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని