కాంగ్రెస్‌లో చేరనున్న ప్రశాంత్‌ కిశోర్‌?

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌లో చేరనున్న ప్రశాంత్‌ కిశోర్‌?

ఈనాడు, దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)కు కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇటీవల రాహుల్‌ గాంధీ సీనియర్‌ నాయకులైన కె.సి.వేణుగోపాల్‌, ఆనంద్‌ శర్మ, కమల్‌నాథ్‌, మల్లికార్జున ఖర్గే, ఎ.కె.ఆంటోనీ, అజయ్‌ మాకెన్‌, అంబికా సోని, హరీష్‌ రావత్‌లతో చర్చలు జరిపారు. ఆయన వస్తే కలిగే లాభనష్టాలపై బేరీజు వేశారు. ప్రశాంత్‌ కిశోర్‌కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు సీనియర్లతో చర్చించాలని రాహుల్‌కు తొలుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. భాజపాను ఓడించడానికి ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన కొన్ని సూచనలపై సీనియర్లు కూడా అంగీకారం తెలిపినట్టు తెలిసింది. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా కనీసం 136 సీట్లను గెలవాల్సి ఉంటుందని, ఇతర పార్టీలతో జత కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రధానం కాదని, అన్ని పార్టీలు ఏకం కావడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన శరద్‌ పవార్‌, లాలూ ప్రసాద్‌, సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ తదితరులతో భేటీ అయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని