దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

ప్రధానాంశాలు

దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

ఉపరాష్ట్రపతి, సీజేఐలకు బార్‌ కౌన్సిళ్ల వినతి

ఈనాడు, దిల్లీ: దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు దక్షిణాది రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి, సీజేఐలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక బార్‌ కౌన్సిళ్ల ఛైర్మన్లు ఎ.నరసింహారెడ్డి, గంటా రామారావు, పి.ఎస్‌.అమల్‌రాజ్‌, ఎల్‌.శ్రీనివాసబాబు, కేరళ బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ కె.ఎన్‌.అనిల్‌ కుమార్‌, శాసనమండలి మాజీ సభ్యుడు ఎన్‌.రామచంద్రరావు, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బి.కొండారెడ్డి తదితరులు సోమవారం కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఎ.నరసింహారెడ్డి విలేకరులతో మాట్లాడారు. దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు విషయమై ఉపరాష్ట్రపతి, సీజేఐలతో పాటు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుకు వినతి పత్రమిచ్చినట్లు తెలిపారు. లక్షలాది కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటి పరిష్కారానికి అనేక సంవత్సరాలు పడుతుందని తెలిపారు. దేశం నలుమూలలా బెంచ్‌లు ఏర్పాటుతోనే కక్షిదారులకు సత్వరం న్యాయం అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని