గెజిట్‌ అమలుపై జల్‌శక్తి ఉన్నతాధికారుల సమీక్ష!

ప్రధానాంశాలు

గెజిట్‌ అమలుపై జల్‌శక్తి ఉన్నతాధికారుల సమీక్ష!

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఆన్‌లైన్‌లో సమీక్షించినట్లు తెలిసింది. బోర్డు సమావేశాల్లో ఖరారు చేసిన ప్రాజెక్టులను 14వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలను బోర్డులు రెండు ప్రభుత్వాలకు అందజేశాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో గెజిట్‌ అమలుపై నెలకొన్న ప్రతిష్ఠంభనను బోర్డులు కేంద్రానికి నివేదించాయి. దీంతో తాజా పరిస్థితులపై జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షించినట్లు తెలిసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని