వైద్య సిబ్బందికి గవర్నర్‌ సత్కారం

ప్రధానాంశాలు

వైద్య సిబ్బందికి గవర్నర్‌ సత్కారం

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి నుంచి రక్షణగా తీసుకుంటున్న కొవిడ్‌ టీకా దేశంలో 100 కోట్ల డోసులు పూర్తవ్వడం సంతోషంగా ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వంద కోట్ల డోసులు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. వైద్య సిబ్బందిని సన్మానించి, వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. త్వరలోనే చిన్నారులకు కూడా టీకా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల డీన్‌ డా.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని