దళితబంధుతో అద్భుత విప్లవం: మంత్రి జగదీశ్‌రెడ్డి

ప్రధానాంశాలు

దళితబంధుతో అద్భుత విప్లవం: మంత్రి జగదీశ్‌రెడ్డి

వాసాలమర్రిలో పది మంది లబ్ధిదారులకు వాహనాల పంపిణీ

‘దళితబంధు’ కింద మంజూరైన గూడ్స్‌ వాహనాన్ని పోషమ్మకు అందజేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

పక్కన ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి తదితరులు

తుర్కపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళితబంధు పథకం’ అద్భుతమైన విప్లవాన్ని తీసుకురాబోతోందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకొన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ‘దళితబంధు’ కింద పదిమంది లబ్ధిదారులకు మంజూరైన ట్రాలీ ఆటో, డోజర్‌, గూడ్స్‌ ట్రాలీ వాహనాలను ఆయన బుధవారం పంపిణీ చేశారు. అనంతరం రైతువేదిక భవనంలో డా.అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని సాహసోపేతంగా ప్రారంభించారని చెప్పారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా లబ్ధిదారులు ఎంచుకున్న రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ వాసాలమర్రిలో ‘దళితబంధు’ ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ బీకునాయక్‌, కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎస్సీ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారి, ఈడీ శ్యాంసుందర్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని