ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి

ప్రధానాంశాలు

ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి

ఐటీ, కార్పొరేటు సంస్థలకు గవర్నర్‌ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులను అభ్యసించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను విరాళంగా ఇవ్వాలని ఐటీ, కార్పొరేటు సంస్థలు, దాతలకు గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు లేక చదువుకు దూరమవుతున్నారన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విరాళాలపై రాజ్‌భవన్‌లో సహాయ విభాగాధికారి అమర్‌నాథ్‌ (ఫోన్‌ నంబర్‌ 9490000242) సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. దాతలు రాజ్‌భవన్‌ మెయిల్‌ rajbhavan-hyd@gov.inకు సైతం సమాచారం పంపాలన్నారు. ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు అవసరమైన విద్యార్థులు తమ పేరు, తరగతి, కోర్సు, కళాశాల పేరు, చిరునామా, ఫోన్‌ నంబరు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో అప్‌లోడ్‌ చేసిన సమాచారాన్ని మెయిల్‌ rajbhavan-hyd@gov.inకు పంపించాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని