Skating: విశాఖ నుంచి గుంటూరు.. ఏకధాటి స్కేటింగ్‌

ప్రధానాంశాలు

Skating: విశాఖ నుంచి గుంటూరు.. ఏకధాటి స్కేటింగ్‌

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-గుంటూరు క్రీడలు: కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు ఆగకుండా తలపెట్టిన స్కేటింగ్‌ విజయవంతం అయ్యింది. 24 గంటల్లో నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకోవటంతో ఆ క్రీడాకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గుంటూరుకు చెందిన ఐకే స్కేటింగ్‌ అకాడమీ క్రీడాకారులు శనివారం ఉదయం 5 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి ఆదివారం ఉదయం 5 గంటలకు గుంటూరు చేరుకున్నారు. దారి పొడవునా జాతీయరహదారిపై స్కేటింగ్‌ చేస్తూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడం ఆకట్టుకుంది. ప్రతి పట్టణంలో ప్రారంభం పాయింటు నుంచి చివరి పాయింటు దాకా క్రీడాకారులు అంతా పాల్గొనేవారు. తర్వాత జాతీయరహదారి మీదకు చేరుకోగానే బ్యాచ్‌ల వారీగా విభజించుకుని స్కేటింగ్‌ చేస్తూ రావటంతో వారికి ఇబ్బందులు ఎదురుకాలేదు. గుంటూరు లాడ్జిసెంటర్‌కు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకోగానే క్రీడాకారుల కుటుంబీకులు, పురప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఇది ప్రపంచ రికార్డని ఐకే స్కేటింగ్‌ అకాడమీ నిర్వాహకులు, కోచ్‌ ఇమ్రాన్‌ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని