పేలు తగ్గాలంటే ఏం చేయాలి? - beauty expert- steps to get rid of lice
close
Published : 31/07/2021 20:37 IST

పేలు తగ్గాలంటే ఏం చేయాలి?

నమస్తే మేడం.. నా వయసు 32ఏళ్లు. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. నా తలలో పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు దువ్వుకున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఏదైనా పరిష్కారం సూచించండి. - ఓ సోదరి
జ. కొబ్బరి నూనె పావు లీటరు, వేపగింజలు కప్పు తీసుకోవాలి. ముందుగా కొబ్బరినూనెను సన్నని సెగమీద 20 నిమిషాలు వేడిచేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి నూనె వేడిగా ఉన్నప్పుడే వేపగింజలు వేసి వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచేయాలి. దీనివల్ల చేదుగా ఉండే నూనె తయారవుతుంది. దాన్ని తలకు అప్త్లె చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. నాలుగు నుంచి ఐదు వారాలు గడిచేసరికి తలలో పేలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే ఆరు నెలల వరకు ఉపయోగించవచ్చు. అయితే దీన్ని ఉపయోగించినన్ని రోజులు వేపగింజలను నూనెలో అలాగే ఉంచాలి. వేపగింజల్లో ఉండే చేదు గుణం వల్ల పేలు పోవడంతో పాటు.. తలలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి.

- శోభారాణి, బ్యూటీ ఎక్స్‌పర్ట్‌

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని